అల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికి అల్లం ఎలా ఉపయోగపడుతుంది?helpfulheartsone

 అల్లం యొక్క ఆరోగ్య  ప్రయోజనాలు బరువు తగ్గడానికి అల్లం ఎలా ఉపయోగపడుతుంది?


అల్లం మనం వాడుకుంటూనే ఉంటాం. అల్లం తెలియని వాళ్లు  ఉండరు. అన్ని కాలాల్లో అందరికి కూడా అందుబాటులో ఉండి రోజు వంటకాల్లో ఉపయోగపడుతూ సాధారణంగా మనం ఎదుర్కునేటివంటి అనేక రుగ్మతల నుండి కాపాడేటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఔషదం ఈ అల్లం. ఎండిన అల్లం శొంఠి అవుతుంది అల్లం, శొంఠి లక్షణాలు ఒకేలా ఉన్నపటికీ అల్లం ప్రదానంగా  చలువ చేస్తుంది. శొంఠి వేడిచేస్తుంది. జీర్ణమండలం చక్కగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడుతాం. ఉదయాన్నే నాలుగు లేదా అయిదు అల్లం ముక్కలు ఉప్పుతో కలిపి నమిలి తినడం ఆరోగ్యం. 

ఈ అల్లాన్ని ఉపయోగించి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. జలుబు, దగ్గు, తుమ్ములు, దద్దుర్లు ఇంకా ఆయాసం పుల్ల తేన్పులు ఇలా అన్ని సమస్యల్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యల్లో దేనితో అయినా మీరు బాధపడుతూ ఉంటె 2 స్పూన్ల అల్లంరసంకి 1స్పూన్ తేనె కలిపి దీన్ని ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటె శరీరంపైన వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి. 

అల్లం-బెల్లం

 మలబద్దకం 

ఇది ఎంత పెద్ద సమస్య అంటే చాలామంది దీనికి జీవితాంతం మందులు వాడుతుండతారు. ఆ మందులతో కూడా తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంట్లోనే అల్లాన్ని ఉపయోగించి మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. అల్లం బెల్లాన్ని సమపాళ్లలో కలిపి నూరి ప్రతీ  రోజూ రాత్రి వాడితే చాలు మలబద్దకానికి. ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది. 

తలనెప్పి 

అనేక రకాల అంశాల వల్ల తలనెప్పి వస్తూవుంటుంది. ఇలాంటి తలనెప్పి మిమ్మల్ని వదలకుండా బాధిస్తూ ఉంటె అల్లం బెల్లం కలిపి తీసుకోడం వలన చక్కని ప్రయోజనాలు ఉంటాయి. 

అరికాళ్లలో అరచేతుల్లో పొట్టులా ఊడుతుంది 

కొంతమందికి అరికాళ్లలో వారి చేతుల్లో పొట్టులా ఊడుతుంది ఇది ఒక విచిత్రమైన సమస్య ఇది తగ్గదని అల్లం,బెల్లం సమపాలల్లో కలిపి నూరి తీసుకుని పైన చేప్పిన విధంగా రోజుకు రెండు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం తీసుకుంటే కొంతకాలానికి ఈ సమస్య తగ్గుతుంది. 
నీళ్ల విరేచనాలు , రక్త విరేచనాలు అలాగే కాళ్ళు ,చేతులు తిమ్మరులకు అల్లం బెల్లం వల్ల చక్కని  ప్రయోజనం ఉంటుంది. 
అల్లంముక్కల్ని తీసుకుని ఒక రోజు నీడలో ఆరబెట్టి  అల్లం ముక్కలు మునిగేంతవరకు నిమ్మరసం వేసి కళ్ళు ఉప్పును  కూడా కొంతకలిపి రెండు రోజులు నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో బాగా ఆరపెట్టండి. ఉఱబెట్టిన  ముక్కలలాగ తయారవుతాయి. రోజు ఉదయం , రాత్రి 1 గ్రాము చొప్పున తీసుకుంటే నోట్లో నీళ్లు ఊరడం, ఆకలి వేయకపోడం, రుచి తెలియకపోడం వంటి అన్ని తగ్గుతాయి. 

అల్లం బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది 

కొవ్వుని కరిగించుకోవాలి బరువును తగ్గించుకోవాలి. మెటాబాలిసంను పెంచుకోవాలి అని అనుకుంటారు. అయితే అల్లంలో బరువు తగ్గించే కొవ్వు కరిగించే గుణాలు కూడా

ఉన్నాయని మీకు తెలుసా! అల్లంను ఉపయోగించి తయారుచేసే జింజర్ వాటర్ను తాగితే కొవ్వు కరుగుతుంది. ప్రదానంగా పొట్ట,నడుము, తడాలా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. ఇపుడు జింజర్ వాటర్ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. అల్లం ముక్క మీడియం సైజు నీరు ఒకటిన్నరలీటరు తీసుకుని అల్లం  ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తయారుచేసుకోవాలి. ఆ ముక్కల్ని నీటిలో వేసి  పెద్ద మంట మీద 10 నిముషాలు మరిగించాలి. మరో 10 నిముషాలు చిన్నమంట  మీద మరిగించి ఆ వాటర్ని వడపోసి రోజులో ఒక్కసారైనా తాగాలి  కావాలంటే ఇందులో తేనె , ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. దీనితో కొద్దిరోజుల్లోనే బరువు తగ్గడం చూస్తారు. దీనినే చాలామంది డిటాక్స్ టీ కూడా అంటారు. 

Post a Comment

0 Comments